ఎన్నికల నిర్వహణ తీరుపై జనసేన అసంతృప్తి - ELECTIONS
గాజువాకలో పవన్ కి సంఖ్య 9 కేటాయిస్తే.. ఈవీఎంలపై 8 వ సంఖ్య అని ముద్రించారు. మా జనసైనికులు గుర్తించారు కాబట్టి సరిచేశారు: మాదాసు
రాష్ట్రంలో పోలింగ్ శాతం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనరు మాదాసు గంగాధరం అన్నారు. ఈవీఎంల సమస్యలతో పోలింగ్ ఆలస్యమైన చోట అదనంగా సమయం కేటాయించి అర్హులైన వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ వంటి నగరాల్లోనూ ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ మొదలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. గాజువాకలో తమ జనసైనికులను పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాక ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.