కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, పశ్చిమబంగా భాజపా రాష్ట్ర ఇంచార్జ్ వి.మురళీధరన్పై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ప్రజాస్వామ్యవాదులు అంతా ఈ దాడిని ఖండించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబంగాలో వరుసగా ఇలాంటి హింసాత్మక ఘటనలే చోటు చేసుకుంటున్నాయని మనోహర్ అన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కాన్వాయ్ మీద దాడి చేసిన తీరు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.