విజయవాడ ఆటోనగర్లో వివిధ అసోసియేషన్ల కృషితో 2 సంవత్సరాల క్రితం 485 ఫ్లాట్లతో జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నారు. ఇక్కడ అపార్లమెంట్ల నిర్వహణ కోసం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీ సభ్యులు కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావటంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఎన్నికలు నిర్వహించకపోతే ఆదివారం నుంచి ఆందోళనకు దిగుతామని ఫ్లాట్ల యజమానులు తెలిపారు.
జమాక్ హౌసింగ్ అసోసియేషన్ ఎన్నికలు వాయిదా - విజయవాడ వార్తలు
విజయవాడలోని జమాక్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వాయిదా పడ్డాయి. దీనితో ఎంతో ఆశగా పాలకమండలి సంఘం ఏర్పాటు చేసుకోవాలనుకున్న అపార్ట్మెంట్ యజమానులు ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించారు.
జమాక్ హౌసింగ్ అసోసియేషన్ ఎన్నికలు వాయిదా