ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి రైతు నీటి కుంటలు ఏర్పాటు చేయాలి - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జల శక్తి అభియాన్ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేక వెంకట అప్పారావు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి సమస్య ఉన్నందువల్ల ప్రతి రైతు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

కృష్ణా జిల్లాలో జల శక్తి అభియాన్ కార్యక్రమం ప్రారంభం

By

Published : Jul 3, 2019, 9:27 AM IST

కృష్ణా జిల్లాలో జల శక్తి అభియాన్ కార్యక్రమం ప్రారంభం

కృష్ణా జిల్లాలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జల శక్తి అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేక వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా నీటిమట్టం తగ్గిన తొమ్మిది జిల్లాలను గుర్తించామని అన్నారు. అందులో కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నీటి మట్టం 70 మీటర్లకు పడిపోయిందని..ఈ పరిస్థితి రాయలసీమ, రాజస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎడారిగా మారటానికి ఎంతో కాలం పట్టదని ఆయన తెలిపారు. ప్రతి రైతు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని...వాటికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు జామతోటలో నీటి కుంట తీసి...కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details