కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వద్ద హైవే బస్టాండ్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఆర్టీసీ ఎండీ ప్రతాప్ పరిశీలించారు. ఔత్సాహిక యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారే సెట్విన్ బస్సులను అవసరమైన ప్రాంతాల్లో తిప్పుకునేలా అవకాశం కల్పిస్తామని ఎండీ తెలిపారు.
హైవే బస్టాండ్ స్థలాన్ని పరిశీలించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే - samineni udhayabhanu taja news
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో హైవే బస్టాండ్ స్థలాన్ని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఆర్టీసీ ఎండీ ప్రతాప్ పరిశీలించారు. సెట్విన్ బస్సుల నూతన ప్రతిపాదన ద్వారా ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు.
jaggyapeta mla and rtc md vistis the land sanctioned for highway bus stand
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. జగ్గయ్యపేటలో త్వరలో హైవే బస్టాండ్ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. ఆర్టీసీలోని 53 ఏసీ బస్సులను కొవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చి ఉచిత సేవలు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాపించకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఇదీ చూడండి:అధికారమే పరమావధిగా..వైకాపా తత్వం: యనమల