ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగ్గయ్యపేటకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత తెదేపాదే' - జగ్గయ్యపేట హెడ్ వాటర్ పైప్ లైన్ వార్తలు

జగ్గయ్యపేట ప్రజలకు కృష్ణా జలాలు అందించాలనే కల నేటికి నెరవేరిందని మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురాం అన్నారు. తెదేపా ప్రభుత్వం హయాంలో హెడ్ వాటర్ పైప్ లైన్, నీటి శుద్ధి ప్లాంట్ పనులు 90 శాతం పూర్తి చేశామని గుర్తు చేసుకున్నారు. మిగిలిన 10 శాతం పనుల్ని పూర్తిచేయడానికి వైకాపా ప్రభుత్వానికి 18 నెలలు పట్టిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు పూర్తై పట్టణవాసులకు కృష్ణా నీరు అందుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

jaggayyapeta drinking water project
jaggayyapeta drinking water project

By

Published : Dec 12, 2020, 1:54 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు కృష్ణా జలాలు అందించేందుకు తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.18.90 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం గుర్తు చేశారు. కృష్ణా నదిలో ఇంటేక్ వెల్ ముత్యాల నుంచి జగ్గయ్యపేటకు జలాల తరలింపు పనులు చేపట్టారని చెప్పారు.

తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయడానికి వైకాపా ప్రభుత్వానికి 18 నెలలు పట్టిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట ప్రజలకు కృష్ణా నది నీటిని అందించే పథకం త్వరలో ప్రారంభం కాబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details