ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేన్సర్ వ్యాధిపై అవగాహనకు 3 కె రన్ - జగ్గయ్యపేటలో 3కె రన్

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ పోలీసులు కేన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి 3 కె రన్ నిర్వహించారు.

jaggayyapet police awareness on cancer by 3 k run
కేన్సర్ వ్యాధిపై అవగాహనకు 3 కె రన్

By

Published : Oct 10, 2020, 12:25 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో 3 కె రన్ నిర్వహించారు. కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు వంద మంది యువకులు, క్రీడాకారులు 3 కె రన్​లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. యువత, మధ్య వయస్కులు శారీరక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పెనుగంచిప్రోలు పోలీసులు సైతం 3కె రన్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు చినబాబు, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details