కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. దిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు తెలిపారు. ఈ కారణంగానే.. జగ్గయ్యపేటను రెడ్ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. పట్టణంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రెడ్ జోన్ గా జగ్గయ్యపేట - two corona positive in jaggayapeta
జగ్గయ్యపేటను రెడ్‌జోన్‌గా ప్రాంతంగా ఆ పట్టణ తహసీల్దార్ ప్రకటించారు. దిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జగ్గయ్యపేటలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు