Jaggaiyapet swimmers : ఈత క్రీడలో తమదైన ముద్ర వేస్తున్న జగ్గయ్యపేట ఈత క్రీడాకారులు మరోసారి జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజయ కేతనం ఎగురవేసి తమ ఘనతను చాటుకున్నారు. జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ ఈతల పోటీలకు వెళ్లిన 22 మంది జగ్గయ్యపేట క్రీడాకారులు 59 పతకాలను సాధించి ప్రశంసలు అందుకున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) వారు న్యూఢిల్లీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ నిర్వహించిన 8వ జాతీయ ఈతల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున వెళ్లిన జగ్గయ్యపేట క్రీడాకారులు విజయధుందుబిమోగించారు.
'ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇస్తా.. కష్టమైనా వచ్చే సీజన్లో ఆడతా'.. రిటైర్మెంట్పై ధోనీ క్లారిటీ
22 మంది.. 59 పతకాలు.. బృందానికి శిక్షకులుగా ఉన్న పోట్ల బత్తిన పాండురంగారావు, లక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు బాలికలు, ఐదుగురు బాలురు పోటీలకు తరలివెళ్లారు. 22 మంది తమ ప్రతిభ కనబరిచి మొత్తం 36 పసిడి, 19 రజత, 4 కాంస్య పతకాలను సాధించారు. వీరంతా ఫ్రీస్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రష్డ్ స్ట్రోక్, 200మీ.లు, 100 మీ.లు, 50 మీ.లు, 25 మీ.ల విభాగాల్లో ప్రతిభను కనబర్చారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారుల్లో గంజిబాబు (75సం.) 2 పసిడి, 1 రజితం, దిడ్డి పాండురంగారావు (65 సం.) 3 పసిడి పతకాలు, పోట్ల బత్తిన పాండురంగారావు (55సం.) పసిడి పతకాలు, బి.వననాగలక్ష్మి (55సం.) 1 పసిడి, 2 రజితం, పొట్టాబత్తిన లక్ష్మి (50సం.) 3 పసిడి పతకాలు, పి.రమాదేవి (45సం) రజత పతకాలు, ఎం.శోభ (45సం.) 2 పసిడి, 1 కాంస్య, ఎస్.ఆదిలక్ష్మి (40సం.) 3 పసిడి పతకాలు, కె.సరితాదేవి (40సం.) 3 పసిడి పతకాలు, ఎం.వినూష (30సం.) 3 పసిడి పతకాలు, వై.రామారావు (35సం.) 2 పసిడి, 1 రజత పతకాలు కైవసం చేసుకున్నారు.