కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అన్ లాక్ అనంతరం కరోనా కేసులు 10కి చేరుకున్నాయి. దీనిపై అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మార్వో రామకృష్ణ అధ్వర్యంలో డీఎస్పీ రమణమూర్తి, కమిషనర్ రామ్మోహనరావు సహా వివిధ శాఖల అధికారులు పాల్గొని.. చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
జగ్గయ్యపేటలో లాక్ డౌన్ సమయాల్లో మార్పులు - krishna district
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లాక్ డౌన్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. కొవిడ్ విస్తరిస్తున్నందున కట్టడి చర్యలు చేపట్టిన్నట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ అమలు అవుతుందని తెలిపారు. ఉదయం కిరాణా షాపులకు, ఇతర షాపులకు 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మందుల దుకణాలు సాయంత్రం 5 వరకూ ఉంటాయని పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో పాజిటివ్ కేసులు పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, స్వీయ నియంత్రణతో కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామనే ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు.
ఇదీ చదవండిరొయ్యల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా- డ్రైవర్‌కు గాయాలు