ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. అనాసాగరం, మునచగర్ల, హనుమంతుపాలెం వద్ద పేదలకు తొలి విడత 1,259 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఈ మొత్తంలో ఒక్కొక్క సిమెంట్ కట్ట రూ. 267ల చొప్పున రూ.24 వేలు విలువ చేసే 90 సిమెంట్ కట్టలు, రూ. 35 వేలు ఖరీదు చేసే 495 కేజీల స్టీల్ అందిస్తారు. మిగిలిన మొత్తం నాలుగు విడతల్లో నిర్మాణ దశలను బట్టి గృహ నిర్మాణ శాఖ అధికారులు మంజూరు చేస్తున్నారు.
జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలతో లబ్ధిదారులకు కష్టాలు !
Jagananna Colonies: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల అష్టకష్టాలు పడుతున్నారు. నిర్మాణ వ్యయం పెరగటం, కాలనీల్లో సరైన సౌకర్యాల లేమితో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణాల్ని పూర్తి చేయాలన్న అధికారుల ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారు.
జగనన్న కాలనీలు
నిర్మాణ వ్యయం భారీగా పెరగటం, కాలనీల్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు. దానికితోడు అధికారులు నిర్మాణాల్ని పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోకపోవటంతో తమపై భారం పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ కట్ట రూ. 400, ఇనుము టన్ను రూ. 75 వేలు వరకు ఉందని వాపోతున్నారు.
ఇవీ చూడండి