రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలో ప్రారంభించేందుకు అధికారులు, అధికార పార్టీ నేతలు సమాయత్తమయ్యారు. పునాదిపాడు గ్రామంలోని జడ్పీ పాఠశాల ప్రాంగణాన్ని వేదికగా నిర్ణయించారు.
గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.