ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ కోడి కత్తి కేసు - నిందితుడి బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా - srinivasa rao bail petition in high court

Jagan Kodi Katti Case in High Court: 2018 సంవత్సరంలో విశాఖలో జగన్ పై హత్యాయత్నం జరిగిన కేసులో తీవ్ర జాప్యం జరుగుతుంది. నిందుతుడు 4 సంవత్సరాల పైనే జైలులో మగ్గుతున్నాడు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ సోమవారం విచారణ జరిపి ఈ నెల 15కు వాయిదా వేసింది.

hearings on kodikathhi case
Jagan Kodi Katti Case bail to accused

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:38 PM IST

Jagan Kodi Katti Case in High Court: కోడికత్తి కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీనివాస రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ పై సోమవారం హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ - NIA) తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 15 కి న్యాయస్థానం వాయిదా వేసింది. విశాఖ విమానాశ్రయం (Visakha Airport) లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్​పై దాడి చేసిన కేసులో పిటిషనర్ శ్రీనివాసరావు నిందితుడిగా ఉంటూ నాలుగేళ్లకు పైగా జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం.. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు

Hearings on Kodikatti Case: విశాఖ ఎన్ఐఏ కోర్టు లో జరుగుతున్న కోడి కత్తి కేసు విచారణ పై అక్టోబరు 17 న హైకోర్టు స్టే విధించింది. 8 వారాల పాటు విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం జగన్ పిటిషన్ ​పై హైకోర్టులో వాయిదా పడింది. ఈ కేసు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 2018 సంవత్సరం విశాఖ విమానాశ్రయంలో జగన్​పై హత్యాయత్నంలో నమోదయిన కేసులో నాలుగు సంవత్సరాలుగా జాప్యం జరుగుతోంది. ఏపీ పోలీసులు, డాక్టర్లపై తనకు నమ్మకం లేదని గతంలో జగన్ ఎన్ఐఏల దర్యాప్తు కావాలని కోరారు. కానీ అదే దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని చెప్పినా కేసు ఒక కొలిక్కి రావటం లేదు.

వాయిదాల పర్వంలో కోడికత్తి కేసు.. తదుపరి విచారణ డిసెంబర్‌ 15కి వాయిదా

NIA Investigation: నిందితునిగా పేర్కొన్న శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని ఎన్ఐఏ పేర్కొంది. ఈ దాడిలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. నిందితుని స్వగ్రామం సందర్శించి, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు పరిశీలించామన్నారు. శ్రీనివాసరావు సంబంధీకులను ప్రశ్నించి.. గత చరిత్ర తెలుసుకున్నామని.. దాడి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదని గతంలో ఎన్ఐఏ తెలిపింది. జగన్ కేసు విచారణ పై కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికే మరింత లోతైన దర్యాప్తునకు ఆదేశిస్తున్నారని నిందితుని తరపు న్యాయవాది కౌంటర్​లో పేర్కొన్నారు. సీఎం జగన్ రాజ్యాంగాన్ని గౌరవించి కోడి కత్తి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని లేదా నిరభ్యంతర పత్రం సమర్పించాలని విశాఖ దళిత సంఘాలు ( విదసం ) గతంలో డిమాండ్ చేశాయి.

"జగన్‌ కేసులు ఎలా తొలగించుకున్నారో.. అన్ని ఆధారాలున్నాయి"

ABOUT THE AUTHOR

...view details