బెయిల్ రద్దవుతుందనే భయంతోనే ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బీఎన్ సుధాకర్ ఆరోపించారు. అధికారిక హత్యలకు కుట్రలు జరుగుతున్నట్లుగా రాష్ట్ర పరిణామాలు ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. ఉన్మాద పాలన సాగుతోందనటానికి రఘురామ పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శమని అన్నారు.
జగన్ బెయిల్ రద్దవుతుందనే భయంతోనే రఘురామకృష్ణ అరెస్టు.. - జగన్ బెయిల్ పిటిషన్
ముఖ్యమంత్రి జగన్ తన బెయిల్ రద్దవుతుందనే భయంతోనే...ఎంపీ రఘరామకృష్ణరాజుపై కక్ష సాధిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బి.ఎన్ సుధాకర్ ఆరోపించారు.
మాట్లాడుతున్న తెదేపా అధికార ప్రతినిధి బి.ఎన్ సుధాకర్ రెడ్డి