ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్‌ ఒక నియంత... సభాపతి, మంత్రులు డమ్మీలు' - జీవో 2430 వార్తలు

మీడియాకు సంకెళ్లు వేయడానికే ప్రభుత్వం సిద్ధమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీలోకి టీవీ 5, మిగతా ఛానెళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ పార్టీ నేతలతో కలసి గవర్నర్​కు ఫిర్యాదు చేశారు.

chandra babu
చంద్రబాబు
author img

By

Published : Dec 12, 2019, 7:11 PM IST

Updated : Dec 12, 2019, 10:39 PM IST

ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డ చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కించపరిస్తే వారు ఆనందపడుతున్నారని దుయ్యబట్టారు. నిరసనలు తెలియజేయకుండా నియంత్రిస్తున్నారని... శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలతో కలసి రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్​ను కలిసిన ఆయన...మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. మీడియాకు సంకెళ్లు వేయడానికే ప్రభుత్వం సిద్ధమైందని... ఏదో విధంగా గుప్పెట్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో కొన్ని ఛానెళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మాజీ స్పీకర్​ మరణానికిి కారణమయ్యారు

రాష్ట్రంలో 650 మంది తెదేపా కార్యకర్తలపై దాడులు జరిగాయని... మాజీ స్పీకర్​ మరణానికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఇలాంటివిఇలాంటివి ఉన్మాది చర్యలు కావా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమానికి తెదేపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండు నాల్కల ధోరణితో వెళ్తున్నారని విమర్శించారు. సభలో సభ్యులను నియంత్రించడం చట్ట విరుద్ధమని చంద్రబాబు ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి:

ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు

Last Updated : Dec 12, 2019, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details