విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందుకు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాక ఆవిష్కరణ అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు సీఎం జగన్ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు.
సామాజిక న్యాయ చరిత్రలోనే లేనివిధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని... జాతీయ జెండా ఆవిష్కరించారు. అవినీతి రూపుమాపేలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని జగన్ స్పష్టం చేశారు. గ్రామాన్ని మార్చేందుకు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చామని... రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసినట్లు తెలిపారు.
వచ్చే బడ్జెట్ అక్కచెల్లెమ్మలకు..
వచ్చే బడ్జెట్‌ను అక్కచెల్లెమ్మలకు అంకితం చేయబోతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రక్షా బంధన్ సందర్భంగా నాలుగు దఫాల్లో 27 వేల147 కోట్ల రూపాయలను పొదుపు సంఘాలకు ఇస్తామని తెలిపారు. మహిళల కోసం వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్ చేయూతను తీసుకొస్తున్నామని చెప్పారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారికి వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు.
ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి..