ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​పై అసభ్య పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు - police

కృష్ణాజిల్లా నూజివీడులో సిఎం జగన్​పై ఫేస్ బుక్ లో అసభ్యంగా సందేశం పెట్టిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.

అరెస్టు

By

Published : Sep 5, 2019, 6:48 PM IST

Updated : Sep 5, 2019, 10:31 PM IST

జగన్​పై అసభ్య పోస్టులు పెట్టినందుకు వ్యక్తిపై కేసు నమోదు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైకృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో అసభ్య పోస్ట్ పెట్టిన ఘటనపై కేసు నమోదైంది. రేగుంట గ్రామానికి చెందిన శ్రీధర్ల శాంత్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్లో 28 తేదీన జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన కృష్ణ అసభ్యంగా స్పందించాడు. ఈఘటనపై శ్రీధర్ల శాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి కృష్ణను అరెస్ట్ చేశారు. ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని నూజివీడు సీఐ రామచంద్రరావు తెలిపారు.

Last Updated : Sep 5, 2019, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details