ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2021, 7:33 PM IST

ETV Bharat / state

సిమెంట్, ఇనుము ధరలు తగ్గించాలంటూ.. నిరసనలకు పిలుపు

సిమెంట్, ఇనుము ధరలు తగ్గించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐకాస నిరసనలకు పిలుపునిచ్చింది. మార్కెట్లో డిమాండ్ లేకపోయినా ఉత్పత్తి సంస్థలు సిండికేట్​గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఐకాస ప్రతినిధులు ఆరోపించారు.

jac
సిమెంట్, ఇనుము ధరలు తగ్గించాలని కోరుతూ నిరసనలకు పిలుపు

సిమెంటు, ఇనుము ధరలు తగ్గించాలని కోరుతూ స్థిరాస్తి , భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐకాస విజయవాడలో శుక్రవారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది. సిమెంట్‌, ఇనుము ధరల పెంపుదల విషయంలో ఓ నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంఘాల నేతలు కోరారు. మార్కెట్లో డిమాండ్ లేకపోయినా ఉత్పత్తి సంస్థలు సిండికేట్​గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఐకాస ప్రతినిధులు ఆరోపించారు.

గత ఆరు నెలల్లో సిమెంటు, ఇనుము ధరలను 40 శాతం పెంచాయని వారు తెలిపారు. దీని వల్ల నిర్మాణ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళుతుందని, దేశంలోనే రెండో పెద్ద రంగం అయిన గృహ నిర్మాణ రంగానికి పెనుముప్పు ఏర్పడిందన్నారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్‌టీ, రేరా, ఇసుక లభ్యత లేకపోవడం, నిపుణులైన కార్మికుల కొరత, కరోనా కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించి పోయిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు విజయవాడ- ఏలూరు ప్రధాన రహదారి వద్ద నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిర్మాణదారులు అంతా పాల్గొనాలని పిసుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details