ఎంఎస్ఎంఈలతో పాటు కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఏపీలోని 97 వేల ఎంఎస్ఎంఈలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాయని.. కేటాయించిన రూ.907 కోట్లు ఆర్థిక సాయానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని మంత్రి తెలిపారు. ఎంస్ఎంఈల విద్యుత్ బకాయిలపై ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి చేశామన్న గౌతమ్‌రెడ్డి.. రాష్ట్రంలోని హానికారక రసాయనాలను వినియోగించే 87 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆడిట్ తర్వాతే కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీపై స్పష్టత లేదు: గౌతమ్‌రెడ్డి
ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్)కు కేంద్రం ఏ ప్రాతిపదికన ప్యాకేజీ ప్రకటించిందనీ.. స్పష్టత లేదని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పాత రుణాలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుందా..? అన్నది తేలాల్సి ఉందన్నారు. కొత్త రుణాలను పూచీకత్తు లేకుండా ఇస్తారా అన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీపై స్పష్టత లేదన్న మంత్రి గౌతంరెడ్డి