రాజధాని గ్రామాల్లో పని చేస్తున్న పారిశుద్ద్య కార్మికలకు వేతనాలు చెల్లించలేదని సీపీఎం నేత బాబూరావు మండిపడ్డారు. అంతేగాక హైకోర్టులో పనిచేస్తున్న 22 మంది కార్మికులను కాంట్రాక్టర్ తొలగించినందుకు న్యాయస్థానం వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. వారికి మద్ధతుగా కార్మికులకు సీపీఎం నేత బాబూరావు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం కార్మికులను తిరిగి పనిలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'హైకోర్టులో పనిచేసే ఒప్పంద కార్మికులను తొలగించటం సరికాదు' - ap amaravathi news
గత కొన్ని నెలలుగా రాజధాని గ్రామాల్లోని పారిశుద్ద్య కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని సీపీఎం నేత బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక హైకోర్టులో పనిచేస్తున్న 22 మంది ఒప్పంద కార్మికులను తొలగించటాన్ని తప్పుపట్టారు. తిరిగి వారిని విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైకోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన