ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోషల్‌ మీడియా అసత్య ప్రచారంపై 'ఐ'గాట్‌

గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మురం చేస్తోన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా... ఎన్నికల సంఘం సూచన మేరకు ఐగాట్ అనే సాఫ్ట్​వేర్​ను విజయవాడ పోలీసులు వినియోగించనున్నారు.

ఐ గాట్ సాఫ్ట్​వేర్ పనితీరు వివరిస్తున్న విజయవాడ సీపీ

By

Published : Mar 13, 2019, 9:07 AM IST

ఐ గాట్ సాఫ్ట్​వేర్
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం... ప్రత్యక్షం కన్నా, సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా జరుగుతోంది. అభివృద్ధిని చూపాలన్న... ప్రత్యర్థిపై వ్యంగాస్త్రాలు సంధించాలన్నా వీటినే వేదికలుగా మార్చుకుంటున్నారు. ఎన్నికలపై ఇంతలా ప్రభావం చూపుతున్న సోషల్‌మీడియాపై ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సోషల్ మీడియా మానిటరింగ్ సెల్​ను ఏర్పాటు చేసి సైబర్ నిపుణులతో పర్యవేక్షిస్తున్నారు. తక్కువ సమయంలో లక్షల మందికి సమాచారాన్ని చేరవేయగల సోషల్​మీడియా వైపు ఎంతో మంది రాజకీయ నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఫేస్​బుక్, ట్విట్టర్, వాట్సప్ వేదికగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అంతేకాక ప్రత్యర్థి పార్టీలకు ఘాటు విమర్శలకు, వివాదాలకు ఈ సామాజిక మాధ్యమాలు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికలకు సరికొత్తగా సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది . ప్రత్యర్థుల పార్టీలపై అసత్య ఆరోపణలు , మార్ఫింగ్ ఫొటోలతో పోస్టింగ్​లు వంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీని కోసం 24 గంటలు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగ్​లను పర్యవేక్షిస్తుంటారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు సైబర్‌క్రైమ్‌లో శిక్షణ పొందిన పోలీసులు మానిటరింగ్ సెల్​లో పనిచేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐ గాట్ అనే సాఫ్ట్​వేర్​ను వినియోగించనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫలానా వ్యక్తి అసత్య ప్రచారం చేస్తే తెలుసుకోవాలని ముందుగానే కోడ్ ఇస్తే .. అటువంటి పోస్టింగ్ రాగానే తెలిసిపోతుంది .ఈ పోస్టింగ్ ఎక్కడ నుంచి వచ్చింది ? ఎవరు పంపారు ? ఎక్కడెక్కడి వెళ్లింది ? అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details