విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనానుమతులు జారీ చేసింది. సీఎం హామీల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు గానూ రూ.90 కోట్లకు దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ప్రతిపాదనలు సమర్పించారని దేవాదాయశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఆలయాభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ - vijayawada latest news
దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి నిధుల వినియోగానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రూ.70 కోట్ల వినియోగానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆలయాభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ