ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.2.27 కోట్ల వసూలుకు నోటీసులు జారీ - విజయవాడలో విద్యుత్ అక్రమ వినియోగం తాజా వార్తలు

విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం అధికారులు గత నెలలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్తును వినియోగిస్తున్నవారిని గుర్తించారు. నిబంధనల మేర వినియోగించని వినియోగదారుల నుంచి రూ.2.27 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేశారు.

Issue notices to illegal consumers of electricity
విద్యుత్ అక్రమ వినియోగదారులకు నోటీసులు జారీ

By

Published : Dec 4, 2020, 2:25 PM IST

విద్యుత్తును నిబంధనల మేర వినియోగించని వినియోగదారుల నుంచి రూ.2.27 కోట్లు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం అధికారులు గత నెలలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా విద్యుత్తును వినియోగిస్తున్నవారిని గుర్తించారు. ప్రధానంగా గృహ అవసరాలకు అనుమతి తీసుకుని, వాణిజ్య అవసరాలకు విద్యుత్తును వినియోగించుకుంటున్న 98 మందిని గుర్తించి రూ.48.07 లక్షలు వసూలు చేయాలని నోటీసులు జారీ చేశారు. అనుమతించిన లోడ్‌ కంటే అదనంగా వాడుకుంటున్న 381 మందిని గుర్తించి రూ.32.80 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించారు.

తక్కువగా బిల్లులు ఇచ్చిన 134 సర్వీసులను గుర్తించి రూ. 104.32 లక్షలు చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. మీటర్‌ లేకుండా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 87 మందిని గుర్తించి రూ.2.97 లక్షలు, మీటర్‌ ఉన్నా అక్రమంగా విద్యుత్తును వినియోగించుకుంటున్న 50 మందికి రూ.39.37 లక్షలు అపరాధరుసుం విధించారు. విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే 94408 12263, 83310 21847 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని ఈఈలు విజయకృష్ణ, కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details