కరోనా కారణంగా నిరాశ్రయులైన అన్నార్తులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. విజయవాడ కృష్ణలంక తోపాటు వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భారతీయ స్టేట్‌బ్యాంకుతోపాటు ఇతర సంస్థలు ఆర్ధికంగా ఇస్కాన్‌కు తమవంతు సాయం అందించాయి. ప్రతిరోజు దేశవ్యాప్తగా నాలుగు లక్షల మందికి ఇస్కాన్ ద్వారా అన్నప్రసాదం అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కరోనా కష్టకాలంలో అన్నార్తులకు 'ఇస్కాన్' అన్నదానం - 'ISKAN' food distribution latest news
విజయవాడ కృష్ణలంక తోపాటు వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి నిరాశ్రయులైన అన్నార్తులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం మూడు విడతల్లో లక్ష మందికిపైగా ఆహారం అందించామని ఆ సంస్థ బాధ్యులు పేర్కొన్నారు.

అన్నార్తులకు 'ఇస్కాన్' అన్నదానం