ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే నేరమా?: చంద్రబాబు

ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారన్న అభియోగాలతో నలంద కిశోర్, కృష్ణా రావు అనే ఇద్దరు వ్యక్తులను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. విమర్శలు ఫార్వర్డ్ చేస్తే అరెస్టులేంటి అని ప్రశ్నించారు.

chandra babu
chandra babu

By

Published : Jun 24, 2020, 4:45 AM IST

సీఎం జగన్ విధానాలను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిని కక్షపూరితంగా అరెస్టులు చేయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన నలందకిశోర్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఆయన ఫార్వర్డ్ చేసిన సందేశంలో ఎక్కడా వ్యక్తిగత దూషణలు లేవని... వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో అరెస్టైన కృష్ణారావునూ విడుదల చేయాలన్నారు. తమ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, పంచుమర్తి అనురాధ చేసిన ఫిర్యాదులను ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని నిలదీశారు. పోలీసులు వివక్ష ఎందుకు చూపుతున్నారన్న చంద్రబాబు.... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details