ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు - krishna district crime news

కృష్ణా జిల్లా నూజివీడు కేంద్రంగా రెండు జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు లక్షలకు పైగా నగదు, సెల్​ఫోన్లు, ఎలక్ట్రిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఓ యాప్ ద్వారా వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ipl cricket betting racket busted
ipl cricket betting racket busted

By

Published : Oct 11, 2020, 8:29 PM IST

రెండు జిల్లాల పరిధిలో ఆన్‌లైన్‌ ద్వారా ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్​ నిర్వహణలో ముఖ్య పాత్రధారుడిగా ఉన్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మొగిలిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు సబ్‌ ఏజెంట్‌లు 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌ బాబు చెప్పారు. వీరంతా కృష్ణా, ప్రకాశం జిల్లాకు చెందిన వారని ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి 6లక్షల 45వేల నగదు, 17 సెల్‌ఫోన్లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఎస్పీ ఆదేశాలతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రత్యేక అధికారి వకుల్‌ జిందాల్‌ నేతృత్వంలో నూజివీడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దర్యాప్తు ప్రారంభించి మొత్తం 18 మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ అనే వ్యక్తి బెట్టింగ్‌ నిమిత్తం ఒక యాప్‌ లింక్‌ రూపొందించి వెంకటేశ్వర్లుకు అందించగా దాని ఆధారంతో గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎంల ద్వారా బెట్టింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. చాకచక్యంగా బెట్టింగ్‌ రాకెట్‌ను ఛేదించిన నూజివీడు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details