విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా... పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వానించారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్, ఆలయ అర్చకులతో కలిసి సీఎంకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు... దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈనెల 17 నుంచి 25 వరకు అమ్మవారికి 9 రోజుల్లో 10 అలంకారాలు చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకు వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.