ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతమ్మ ఆలయంలో ప్రసాదాల తయారీకి ఐదోసారి టెండర్లు - Invitation for tenders for making prasadam news

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ టెండర్ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికీ నాలుగు సార్లు టెండర్లు పిలిచారు. గుత్తేదారులు అధిక ధరలకు కోట్ చేయడంతో దేవాలయ అధికారులు మరోమారు టెండర్లు ఆహ్వానించారు. ప్రసాదాల తయారీ ధర విషయంలో గుత్తేదారులకు, దేవస్థానం అధికారుల మధ్య తేడా వస్తోంది.

Invitation for tenders for making prasadam
ప్రసాదాల తయారీకి టెండర్లు

By

Published : Apr 25, 2021, 12:29 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ప్రసిద్ధి చెందిన తిరుపతమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2010లో ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ ప్రాంగణంలో లడ్డూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటినుంచి ఏడాదికోసారి కాంట్రాక్ట్​ విధానంలో గుత్తేదారులకు ప్రసాదం తయారీ బాధ్యత అప్పగిస్తున్నారు. దానికి అవసరమైన సరకు మొత్తం దేవస్థానమే సరఫరా చేస్తుంది. గుత్తేదారులు లడ్డూ, పులిహోర తయారుచేసి అందజేస్తారు.

గతేడాది కరోనా ప్రభావంతో మార్చి నెలలో ఆలయం మూసివేసే సమయంలోనే గుత్తేదారు కాంట్రాక్ట్ కూడా ముగిసిపోయింది. ఆలయం తెరిచిన తర్వాత టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దేవస్థానమే ప్రసాదాలు తయారుచేసి భక్తులకు అందించింది. 80 గ్రాముల లడ్డూ రూ. 10, 150 గ్రాముల పులిహోర ప్యాకెట్​ రూ.10కి భక్తులకు అందిస్తుంటారు. ఏడాదికి 15లక్షల లడ్డూలు, 50,000 పులిహోర ప్యాకెట్​లను భక్తులు కొనుగోలు చేస్తుంటారు.

లడ్డూకు 30 పైసల చొప్పున ఖర్చు..
ఏడాదిగా దేవస్థానమే ప్రసాదం తయారు చేయిస్తోంది. కానీ ఇందులో సిబ్బంది కొరత వంటి సమస్యలున్నాయి. దీంతో టెండర్లు పిలిచి ఆ బాధ్యత గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. లడ్డూ, పులిహోర తయారీకి 30పైసల చొప్పున కూలీ ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. అదనంగా జీఎస్టీ కలుపుకున్నా తయారీ ఖర్చు 33 పైసలు దాటదని అంటున్నారు. కానీ నాలుగు సార్లు టెండర్లలో గుత్తేదారులు వరుసగా 63, 59, 45, 50 పైసల చొప్పున టెండర్లు దాఖలు చేశారు.

ధర తగ్గితేనే ఇస్తాం..

ప్రసాదాల తయారీకి గుత్తేదారులు అధిక ధరలు కోట్ చేస్తున్నారు. అధిక ధరలతో నాలుగు సార్లు చేయడం వల్ల ఆ టెండర్లను తిరస్కరించాను. కొత్తగా టెండర్లు పిలిచాను. ఈసారైనా నా గుత్తేదారులు ఆమోదయోగ్యమైన ధరలతో ముందుకు వస్తే టెండర్ ఖరారు చేస్తాం -ఎన్​విఎస్​ఎన్ మూర్తి, ఆలయ ఈవో

ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా శ్రీనివాసుని వసంతోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details