రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కొవిడ్ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేపట్టింది. పలు పోస్టులను భర్తీ కోసం ఇప్పటికే పలు జిల్లాలో దరఖాస్తూలను స్వీకరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పలు పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తూలను ఆహ్వానించింది. అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఫల్మనాలజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్పులు నియామకానికి విజయవాడ గవర్నర్ పేటలోని ఐవిప్యాలెస్‌లో ఆగస్టు ఒకటో తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు కోరారు.
కొవిడ్ ఆసుపత్రుల్లో నియామకాలకు ఆగస్టు ఒకటో తేదీన ఇంటర్వ్యూలు - walk in interviews in medical staff in krishana district
కృష్ణా జిల్లాలో కొవిడ్ -19 అత్యవసర సేవల విధులకు స్పెషలిస్ట్, జనరల్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ఆగస్టు ఒకటో తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా వైద్యులు, వైద్య సిబ్బందిని తీసుకుంటున్నామన్నారు. ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కోవిడ్ ఆసుపత్రుల్లో నియామకాలకు ఆగస్టు ఒకటో తేదీన ఇంటర్వ్యూలు
అనస్థీషియన్ టెక్నీషియన్, ల్యాబ్ ఎక్స్‌రే, ఈసీజీ, డయాలసిస్, నర్సింగ్ ఆర్డర్లీ, హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది,డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 10 గంటల నుండి లోపు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, బయోడేటాతో హాజరుకావాలన్నారు.
ఇవీ చదవండి