కేవలం మగవారికే సొంతమైన మృదంగ వాద్య విద్యలో... వారితో ధీటుగా పోటీపడి... శ్రోతలను, రసజ్ఞులను అమితంగా అలరించి... పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు తెలుగు మహిళ దండమూడి సుమతి. పురుషాధిక్యం బలంగా ఉన్న రోజుల్లోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి... తనదైన ప్రతిభను చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950వ సంవత్సరంలో సుమతి జన్మించారు. తొలుత తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ పొందారు. దేశవిదేశాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, వంటి అనేక బిరుదులు పొందారు. 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం సుమతిని వరించింది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సుమతితో ముఖాముఖి.
మృదంగ విదూషి.. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుమతితో ముఖాముఖి - Telugu woman selected for Padma Shri
ఆడపిల్లని అడుగు బయట పెట్టనివ్వని రోజుల్లో.. మగవారికి ధీటుగా దేశవిదేశాల్లో ఏన్నో ప్రదర్శనలు ఇచ్చారు సుమతి. మగవారి వాయిద్యంగా పిలిచే మృదంగంలో తనదైన ప్రత్యేకతను చూపుతూ.. అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఆమె ప్రతిభకు జాతీయ స్థాయి అవార్డులు.. దాసోహం అయ్యాయి. దేశంలో ప్రతిష్టాత్మక అవార్డులో ఒకటైన పద్మశ్రీ నేడు వరించింది.
![మృదంగ విదూషి.. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుమతితో ముఖాముఖి Sumathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10386871-140-10386871-1611654478673.jpg)
మృదంగ విదుషి పద్మశ్రీ పురస్కార గ్రహీత సుమతితో ముఖాముఖి
మృదంగ విదుషి పద్మశ్రీ పురస్కార గ్రహీత సుమతితో ముఖాముఖి