ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాల్లో చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు - Interstate thief arrested for stealing from temples in krishna district

ఆలయాల్లో చోరీలు చేయడంలో ఆరితేరిన అంతర్రాష్ట్ర దొంగను కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆలయాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన హుండీలను దొంగిలిస్తూ ఎవరికీ చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

police
police

By

Published : Sep 29, 2020, 4:28 PM IST

ఈనెల 14వ తేదీ రాత్రి కొర్లమండ గ్రామ శివారులోని.. దాసాంజనేయ స్వామి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలకొట్టి రూ.2వేలను దొంగిలించారు. ఈ కేసుపై కృష్ణాజిల్లా ఎస్పీ నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మంగళవారం తెల్లవారుజామున కొర్లమండ శివారు విద్యానగరంలో అంతరాష్ట్ర నేరస్తుడు అయిన పఠాన్ సలార్ ఖాన్​ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. పఠాన్​ను పోలీసులు విచారించగా.. జూలై 4వ తేదీన జగ్గయ్యపేట.. చిల్లకల్లు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి హుండీలో 6వేలు, ఈనెల 8వ తేదీన మైలవరం మండలం ఎదురుబీడం గ్రామం రామాలయం గుడి హుండీలో 10వేలను దొంగిలించినట్లు తేలింది. నిందితుడి మీద రాష్ట్రంలో పలు పోలీసు స్టేషన్లలో సుమారు 80 కేసులు నమోదైన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తిరువూరు సీఐ శేఖర్ బాబు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details