రాష్ట్రంలో పోలీసులు పటిష్ట నిఘాతో గంజాయి స్మగ్లర్‌లను, దారీ దోపిడీ దొంగలను చాకచక్యంగా పట్టుకుంటున్నారు. నకిలీ పోలీసుల అవతారం ఎత్తిన ఆరుగురు ముఠా సభ్యులు.... గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటుగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, 20 దారి దోపిడీలకు పాల్పడినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామన్నారు.
భారీగా చోరీ సొత్తు స్వాధీనం
నకిలీ పోలీసుల ముఠా నుంచి 250గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కార్లు, 4 మోటార్ బైక్లు, 51 వేల నగదు, 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలియజేశారు. చోరీ చేసుకున్న సొత్తు విలువ 17 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. నకిలీ పోలీసుల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గుడివాడ క్రైమ్ సీఐ మురళి కృష్ణా, రూరల్ సీఐ అబ్దుల్ నబి, సిబ్బందికి ఎస్పీ రవీంద్రబాబు రివార్డులు అందజేశారు.
ఇవీ చదవండి:
అయిదు రోజుల్లోనే రూ.10.50 లక్షలు జరిమానా: సీపీ శ్రీనివాసులు