గన్నవరం ఎయిర్పోర్ట్లో అధునాతన పరికరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అతి తక్కువ విమానాశ్రయాలకు సమకూరే అతి ఖరీదైన బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ పరికరాలను విజయవాడ విమానాశ్రయంలో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు అన్నారు. విమానాశ్రయ భద్రత సిబ్బంది స్థానిక పోలీసుల సమన్వయంతో ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా వ్యవస్థ కొనసాగిస్తున్నామని తెలిపారు.
విజయవాడ విమానాశ్రయంలో అధునాతన పరికరాలు ప్రారంభం - international level technology stated in vijawayda
విజయవాడ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ 1.07 కోట్ల వ్యయంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయనికి బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ సిస్టం అధునాతన పరికరాలను ప్రారంభించారు. దీని వల్ల భద్రతాపరంగా మరింత పటిష్ఠంగా ఉంటుందని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయనికి బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ సిస్టం అధునాతన పరికరాలు ప్రారంభం