Gannavaram Airport: విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయాన సేవలు నేడు ప్రారంభమవుతాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. విమానయాన శాఖ మంత్రి, ఎయిర్ ఇండియా అధికారులతో అనేకసార్లు ఈ విషయమై దిల్లీలో చర్చించిన తర్వాత అనుమతులు లభించాయన్నారు.
ఎయిర్ ఇండియా వారిచే విజయవాడ నుంచి షార్జాకు వారంలో రెండు రోజులు పాటు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం, శనివారం రాత్రి 9.05 గంటలకు విమానం బయలు దేరుతుందని తెలిపారు.
ఈ రోజు సాయంత్రం తొలిసారిగా విజయవాడ వచ్చి షార్జాకు ప్రయాణీకులను తీసుకెళ్లనుందని అన్నారు. అలాగే విజయవాడ నుంచి మస్కట్‌కు ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు, విజయవాడ నుంచి కువైట్‌కు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విమానాలు నడుపుతారని తెలిపారు. నేటి సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి మొదటిసారిగా వస్తున్న షార్జా విమానానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి స్వాగతం పలుకుతారు. అలాగే షార్జాకు వెళ్లే ప్రయాణీకులకు బోర్డింగ్ పాసులను అందచేస్తారు.
ఇవీ చదవండి: