కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య చిన్నఅవుటపల్లిలో ఘర్షణ జరిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న తమను ఎమ్మెల్యే వర్గీయులు దూషించారని దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ వివాదం కాస్త ఆత్కూరు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. ఇరువర్గాల వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి ఘర్షణ జరగకుండా అవుటపల్లి గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
గన్నవరం వైకాపాలో వర్గపోరు...రంగంలోకి పోలీసులు
గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే వంశీ వర్గీయులు... తమను దూషించారని ఆ పార్టీ నేత దుట్టా రామచంద్రరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
GANNAVARAM_YSRCP_GODAVA