ప్రభుత్వ పెద్దలు, పోలీసుల నుంచి రక్షణ కల్పించాలంటూ కృష్ణా జిల్లాకు చెందిన జ్ఞానేందర్, అనూష దంపతులు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న తమను మంత్రి పేర్ని నాని అనుచరులు ఇప్పటికీ బెదిరిస్తున్నారని వారు వాపోయారు. దంపతులకు ఆర్థిక సాయం అందించిన చంద్రబాబు... వారి కుటుంబానికి రక్షణగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. జ్ఞానేందర్ దంపతులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టం చేశారు.
'ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. మమ్మల్ని బెదిరిస్తున్నారు' - కృష్ణా జిల్లాలో ప్రేమజంటకు బెదిరింపులు
మంత్రి పేర్ని నాని అనుచరులు బెదిరిస్తున్నారని ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు చంద్రబాబును ఆశ్రయించారు. న్యాయం జరిగే వరకు తెదేపా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు వారికి తెలిపారు.
కృష్ణా జిల్లాలో ప్రేమజంటకు బెదిరింపులు
రక్షణ కల్పించాలంటూ ఎంత మంది పెద్దల్ని కలిసినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు అనూష ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి. టెడ్ లేకనే.. అవి చనిపోతున్నాయి..!
Last Updated : Feb 18, 2021, 4:21 PM IST