ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్త వాహనాలకు త్వరలో అమలు - Insurance implementation for new vehicles

కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు బీమా ప్రీమియంను ఇక నుంచి ఏ ఏటికాయేడు చెల్లించవచ్చు. రాష్ట్రంలో కొత్త వాహనాలకు త్వరలో అమలు ఒకేసారి 3, 5 ఏళ్ల బీమా నుంచి ఉపశమనం కలగనుంది.

bheema
bheema

By

Published : Jul 29, 2020, 6:49 AM IST

కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు బీమా ప్రీమియంను ఇక నుంచి ఏ ఏటికాయేడు చెల్లించవచ్చు. ఇప్పటివరకు ఉన్న మూడేళ్లు, ఐదేళ్లకు ఒక్కసారే ప్రీమియం చెల్లించాలనే నిబంధన నుంచి రాష్ట్రంలోని కొనుగోలుదారులకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం ఎవరైనా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే తొలి ఏడాది పూర్తి స్థాయి బీమా, మిగిలిన నాలుగేళ్లకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్నారు. కార్లకు తొలి ఏడాది పూర్తి బీమాతోపాటు మరో రెండేళ్లకు థర్డ్‌ పార్టీ ప్రీమియం కట్టించుకుంటున్నారు. అయితే ఇలా ముందుగానే ప్రీమియం తీసుకోకూడదని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో ఈ విధానం అమలు కానుంది. దీనివల్ల కొనుగోలుదారులపై ఒకేసారి భారం పడే ఇబ్బంది తగ్గనుంది.

చెక్‌ పోస్టులను తొలగించే అవకాశం

రాష్ట్రంలో రవాణాశాఖకు చెందిన చెక్‌ పోస్టులను తొలగించే అంశం పరిశీలనలో ఉంది. సరిహద్దుల్లో రాష్ట్రంలోకి రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఈ చెక్‌పోస్టులున్నాయి. జీఎస్టీ అమలు చేస్తుండటం, కేంద్రానికి చెందిన వాహన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాహనాల వివరాలు అందుబాటులో ఉంటున్నందున రాష్ట్రాల్లో చెక్‌ పోస్టుల అవసరం లేదని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఒడిశాలో వీటిని తొలగించారు.

ఇదీ చదవండి:కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం

ABOUT THE AUTHOR

...view details