హైదరాబాద్‌లో వరుణుడి ఆగ్రహానికి చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. వేల సంఖ్యలో వాహనాలు నీళ్లలో మునిగిపోయాయి. కొన్నైతే పడవల్లా నీటిపైన కొట్టుకుపోయాయి. సాధారణంగానే వాహనాలకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వరదల వల్ల కార్లలో చాలా భాగాలు పాడయిపోయే ఆస్కారం ఉంది.
వరదలు ప్రారంభమైనప్పటి నుంచి సర్వీస్ సెంటర్లకు.. నీటిలో మునిగిన వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. 95 శాతానికి పైగా వాహనాలు వరదల్లో మునిగినవి లేక వరదల వల్ల డ్యామేజీ అయినవే వస్తున్నాయని సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు. వీటికి సంబంధించి రిపేరు, సర్వీసింగ్‌కు కూడా చాలా సమయం పడుతోంది. ఒకేసారి భారీగా వాహనాలు సర్వీస్ సెంటర్ల వద్ద క్యూ కట్టడం వల్ల ఇలా జరుగుతోందని వారు చెబుతున్నారు.
- మునిగిన తీరును బట్టి వర్గీకరణ..
వాహనం నీటిలో మునిగిన తీరును బట్టి వర్గీకరిస్తున్నారు సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు. మొత్తం నీటిలో మునిగిన వాహనాన్ని సీ క్యాటగిరీగా, సీట్ స్థాయి వరకు మునిగిన వాహనాన్ని బీ క్యాటగిరీగా, కార్పెట్ వరకు మునిగిన వాహనాన్ని ఏ క్యాటగిరీగా విభజిస్తున్నారు. ఎక్కువగా సీ క్యాటగిరీ వాహనాలే సర్వీస్ సెంటర్లకు చేరుతున్నాయి. బీమా సంస్థలను సంప్రదించి, క్లెయిమ్‌ను పరిగణనలోకి తీసుకొని రిపేర్, సర్వీసింగ్ పూర్తి చేయటానికి సమయం పడుతోంది. ఏ క్యాటగిరీ వాహనం 3 నుంచి 5 రోజులు, బీ క్యాటగిరీ వాహనాలకు దాదాపు 3 వారాలు, సీ క్యాటరిగీ వాహనాలకు ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు.
- తీసుకున్న బీమా బట్టి క్లెయిమ్..
వాహనంలో చిన్న చిన్న రిపేర్లకే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు వరదల వల్ల వాహనాల్లో ఎలాంటి డ్యామేజీ జరిగింది? ఎంత వరకు ఖర్చువుతుంది? బీమా క్లెయిమ్ అవుతుందా? లేదా? అన్నది వాహనదారులను కలవరపెడుతోంది. వాహనదారులు తీసుకున్న బీమాను బట్టి క్లెయిమ్ అవుతోందని వాహన బీమా నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా వాహనానికి సంబంధించి బీమాలో పలు రకాలుంటాయి. అందులో ఒకటి థర్ట్ పార్టీ. థర్డ్ పార్టీ బీమాలో వాహన డ్యామేజీకి సంబంధించి ఎలాంటి బీమా ఉండదు. ఇది కేవలం వాహనం వల్ల ఇతరులకు, ఇతర వాహనాలకు కలిగిన డ్యామేజీకి మాత్రమే వర్తిస్తుంది. బీమా రెగ్యులేటరీ ప్రకారం రోడ్డుపై తిరిగే ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనితో దాదాపు అన్ని వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ఉంటుంది.
రెండో రకం.. కాంప్రీహెన్సీవ్ బీమా. ఇందులో థర్డ్ పార్టీతో పాటు వాహన డ్యామేజీ నష్టానికి సంబంధించి బీమా ఉంటుంది. వాహన వయస్సు పెరుగుతున్న కొద్ది దాని విలువ తగ్గిపోతుంది. ఈ తగ్గిన విలువ ఆధారంగా కాంప్రిహెన్సీవ్ బీమాలో కవరేజీ ఉంటుంది. జీరో డిప్ అనేది మరో పాలసీ. ఇందులో వాహన భాగాలపై విలువ తగ్గింపును పరిగణనలోకి తీసుకోకుండా వంద శాతం విడిభాగాల విలువకు కవరేజీ ఉంటుంది. కాంప్రిహెన్సీవ్, జీరో డిప్లో ఇంజిన్‌కు బీమా ఉండదు.
- జీరో డిప్ పాలసీ వారికి పూర్తిగా బీమా..