ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా రహిత గ్రామాల పునర్నిర్మాణమే ధ్యేయంగా తనిఖీలు - Special Enforcement Bureau latest news updat3e

సారా రహిత గ్రామాల పునర్నిర్మాణమే ధ్యేయంగా కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతన పల్లి గ్రామంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు.

Inspections by Special Enforcement Bureau
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు

By

Published : Oct 27, 2020, 11:41 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సారా రహిత గ్రామాల పునర్నిర్మాణమే ధ్యేయంగా తనిఖీలు చేపట్టినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ఈ దాడులలో 110 లీటర్ల కాపుసారా, 6 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి, 20 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని రిమాండ్​కి పంపనున్నట్లు వివరించారు. సారా తయారీ క్రయవిక్రయాలు సరఫరాపై ఎలాంటి సమాచారం ఉన్నా.. తమకు తెలియ చేయాలని కోరారు. ఈ దాడుల్లో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, చాట్రాయి ఎస్ఐ కె శివ నారాయణ, నూజివీడు డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details