ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంగ్రెస్​ రాజ్​భవన్​ ముట్టడి...అడ్డుకున్న పోలీసులు..శైలజానాథ్​కు గాయాలు - appcc president news

ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్​ గాయపడ్డారు. రాజ్​భవన్​ ముట్టడికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నంలో స్వల్ప గాయాలయ్యాయి.

chalo rajbhavan
చలో రాజ్​భవన్

By

Published : Jan 19, 2021, 2:19 PM IST

రాజ్​భవన్​ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

రాజ్​భవన్ ముట్టడిలో భాగంగా వెళ్తున్న ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్​ను పోలీసులు అడ్డుకోవడానికి చేసిన యత్నంలో ఆయనకు గాయాలయ్యాయి. కిసాన్ అధికార దివాస్ సందర్భంగా "చలో రాజ్​భవన్​" కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విజయవాడలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు రాజ్​భవన్​ ముట్టడికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ జరిగిన తోపులాటలో శైలజానాథ్​ స్వల్పంగా గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details