ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధ్వజ స్తంభం మేకలం విరిగిపడి భక్తురాలి తలకు గాయాలు - Vijayawada Kashi Vishweshwara Swamy Temple News

ఆలయానికి వెళ్లిన ఓ భక్తురాలిపై.. ధ్వజ స్తంభం మేకలం విరిగి పడింది. ఆమె తలకు గాయాలు కాగా.. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ధ్వజస్తంభం మేకలం విరిగిపడి భక్తురాలి తలకు గాయాలు
ధ్వజస్తంభం మేకలం విరిగిపడి భక్తురాలి తలకు గాయాలు

By

Published : Nov 17, 2020, 4:44 PM IST

సత్యనారాయణపురంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభం మేకలం ఊడి తలమీద పడటంతో ఓ భక్తురాలు గాయపడింది. ఆకాశదీపాన్ని అర్చకులు కడుతున్న సమయంలో మేకలం ఊడి.. మాణిక్యాంబ అనే భక్తురాలి తలపై పడింది. సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

ఆమె తలకు రెండు కుట్లు పడ్డాయని ఆలయ ఈవో సీతారామయ్య తెలిపారు. ఘటన సమయంలో భక్తులు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. మేకలం ఊడి పడిన తర్వాత ఆలయాన్ని మూసివేశామని, ప్రాయశ్చిత్త సంప్రోక్షణ అనంతరం తిరిగి మంగళవారం యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామన్నారు.

మేకలం విరిగిపడి భక్తురాలి తలకు గాయాలు

ఘటన స్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తేదేపా నాయకులు జయసూర్య, స్ధానిక తేదేపా నాయకులతో కలిసి పరిశీలించారు. భక్తురాలు గాయపడటం బాధకరమన్నారు. దేవాలయ నిర్వాహాక కమిటీ శ్రద్ధ వహించి వెంటనే నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ ఘటన స్థలాన్నిపరిశీలిస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తేదేపా నాయకులు జయసూర్య

ఇవీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న 14 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details