ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు - vegetables

ఏటా ఆషాఢమాసంలో మూడురోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అమ్మవారు

By

Published : Jul 13, 2019, 8:27 PM IST

శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

శాకంబరి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. ఏటా అషాఢ మాసంలో మూడు రోజుల పాటు అమ్మవారు వివిధ రకాల కూరగాయాలతో అలంకృతమై... శాకంబరి దేవిగా భక్తులకు అభయమిస్తారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం వరకు జరగనున్నాయి. ఆషాఢ సారె కార్యక్రమంతో పాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్న తరుణంలో... ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దాతలు ముందుకొచ్చి కూరగాయలను విరాళంగా ఇస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని సిద్ధం చేసి భక్తులకు అందజేయనున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అత్యంత ఘనంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details