ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట... దుర్గమ్మ సేవలో ప్రముఖులు - ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, కన్నా లక్ష్మీనారాయణ

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు బారులు తీరుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Oct 8, 2019, 9:45 AM IST

Updated : Oct 8, 2019, 11:49 AM IST

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న..డీజీపీ, మంత్రులు, భాజపా రాష్ట్రాధ్యక్షుడు

దసరా శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఆఖరి రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. భారీగా చేరుకుంటున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే రద్దీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భవానీలతో కృష్ణవేణి ఘాట్‌ నిండిపోయింది. ఆ తల్లి చల్లని చూపు కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులూ కొండపైకి చేరుకుంటున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉన్నతాధికారులు కొందరు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

Last Updated : Oct 8, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details