రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతిసేలా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక, జాతీయ జనాభా పట్టిక ఉన్నాయని భారత న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది. విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు ఒక్కటై రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తీర్మానించారు విజయవాడలో నిర్వహిస్తున్న అఖిల భారత న్యాయవాదుల సంఘ సమావేశంలో సీఏఏ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిపై జరిగిన దాడులను ఖండించి, మద్దతు ప్రకటించారు. యువ న్యాయవాదులకు ఉపకార వేతనం, సంక్షేమ పథకాలు అందేలా కృషిచేయాలని, దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గేలా పోరాడాలని, మరో రెండు తీర్మానాలు చేసినట్లు ఐఏఎల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసింగ్ సీమా తెలిపారు.
విజయవాడలో భారత న్యాయవాదుల సంఘ సమావేశం - Indian Lawyers Association latest news update
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక, జాతీయ జనాభా పట్టికలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని భారత న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది. విజయవాడలో నిర్వహిస్తున్న అఖిల భారత న్యాయవాదుల సంఘ సమావేశంలో పలువురు మాట్లాడుతూ అందరూ రాజ్యంగ పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చింది.
విజయవాడలో భారత న్యాయవాదుల సంఘం సమావేశం