India Car Racing League: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా రేసింగ్ లీగ్ సమయాభావం, రేసర్లకు స్వల్ప ప్రమాదాల వల్ల పూర్తిస్థాయి పోటీలు జరగలేదు. అసలైన తుది రేసింగ్ మజాను భాగ్యనగరవాసులు ఆస్వాదించలేకపోయారు. నిన్న టెస్ట్ రేస్‌లు నిర్వహించగా.. ఇవాళ సమయాభావం కారణంగా పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయారు. ఉదయం 9గంటల నుంచి జేకే టైర్స్ ఆధ్వర్యంలో ఫార్ములా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి.
స్వల్ఫ ప్రమాదాల వల్ల క్వాలిఫయింగ్ రేస్ ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్ నిలిచిపోయింది. చీకటి పడటంతో... రేసింగ్‌కు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటం రేపు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఫార్మూలా-4 రేసుతోనే నిర్వాహకులు ముగించారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. వీఐపీ టికెట్ తీసుకున్నప్పటికీ లోపలకు అనుమతించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.