కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. నిత్యకల్యాణం, పుట్టలో పాలుపోయడం, పొంగళ్లు నివేదన, తలనీలాలు, కుట్టు పోగులకు వచ్చిన భక్త జనంతో.. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి పెరిగిన భక్తుల రద్దీ - కృష్ణాజిల్లా తాజా వార్తలు
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కరోనా నిబంధనలు కాస్త సడలించటంతో వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి పెరిగిన భక్తుల రద్దీ