ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్​ కావాలా.. గోదావరి తీరానికి వెళ్లాల్సిందే!

ఆ గ్రామంలో పింఛను తీసుకోవాలంటే గోదావరి తీరానికి రావాల్సిందే! పింఛన్​ కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సిందే. ఇదీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని పింఛను లబ్ధిదారులు పరిస్థితి.

పింఛను కావలంటే గోదావరి తీరానికి వెళ్లాల్సిందే!

By

Published : Aug 2, 2019, 2:52 PM IST

గోదావరి తీరాన పింఛను తీసుకుంటున్న వృద్ధులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని కోడేరు గ్రామంలో పింఛన్ అందుకోవాలంటే గోదావరి తీరానికి రావాల్సిందే. ఎందుకంటే నెట్​వర్క్​సమస్య వల్ల పింఛన్ పంపిణీ అంతా గోదావరి తీరంలో జరుగుతోంది. గ్రామంలో 245 మందికి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తోంది. పింఛను కోసం గోదావరి తీరానికి రెండు మూడు రోజులపాటు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వృద్ధులు వాపోతున్నారు. నెట్​వర్క్​ సమస్య లేకుండా నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవని గ్రామస్థులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details