ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: మంత్రి వెల్లంపల్లి - In Vijayawada Rs. 1.4 crore development works

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. విజయవాడలో కోటి 40 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీని అధికారం నుంచి దించే వరకు నిద్రపోనని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.

in-vijayawada development works
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

By

Published : Jan 22, 2020, 12:50 PM IST

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలో రూ.1.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీని అధికారం నుంచి దించే వరకు నిద్రపోనని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. నిలకడ లేని నాయకుడు రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. ఇదే విధానంతో కొనసాగితే రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కునూ పవన్ కల్యాణ్ కోల్పోయే అవకాశాలున్నాయని మంత్రి అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details