విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసిఉన్న శాకంబరి రూపి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువ జామునే క్యూలైన్లన్నీ నిండిపోయాయి.100 రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లు క్యూలైన్లు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి.రేపు ఆలయంలో నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంతో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయని స్థానాచార్యలు వెల్లడించారు.భక్తులందరూ శాకంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిరావాలి ఆచార్యులు పిలుపునిచ్చారు.
రేపటితో ముగియనున్న శాకాంబరి ఉత్సవాలు - ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శాకంబరి దేవి రూపంలో అభయమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు