ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రరాజ్యంలో మండలి బుద్ద ప్రసాద్​కు అరుదైన గౌరవం - latest news in the us sri mandali is a rare honor for budda prasad

సీనియర్​ తెదేపా నేత, మాజీ డిప్యూటీ స్పీకర్​ మండలి బుద్ద ప్రసాద్​కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని నాపెర్ వెల్లి నగరం అక్టోబర్ 25 వ తేదీని 'డా.మండలి బుద్ద ప్రసాద్ డే' గా ప్రకటించింది.

డా.మండలి బుద్ద ప్రసాద్​కి గౌరవ పురస్కారం

By

Published : Oct 27, 2019, 4:23 PM IST

డా.మండలి బుద్ద ప్రసాద్​కి గౌరవ పురస్కారం

తెదేపా సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్​ మండలి బుద్ద ప్రసాద్​కు అగ్రరాజ్యంలో అరుదైన గౌరవం లభించింది. గాంధేయవాదిగా, సమాజ సేవకునిగా, మంత్రిగా, ఉప సభాపతిగా వివిద హోదాల్లో ఆయన చేసిన సేవలను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు చేస్తోన్న కృషిని ప్రస్తుతిస్తూ... అమెరికాలోని నాపెర్​ వెల్లి నగరం అక్టోబర్​ 25వ తేదీని 'బుద్ద ప్రసాద్​ డే' గా ప్రకటించింది. దీనికి సంబంధించి నాపెర్​ వెల్లి నగర మేయర్​ స్టీవ్​ చిరికా జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని కమిషనర్​ జూడిత్​ బ్రాడ్​ హెడ్​ బుద్ద ప్రసాద్​కు అందజేశారు. ఈ సందర్భంగా భారతి తీర్థ వ్యవస్థాపకులు ఆయన సేవలను కొనియాడారు.

బాధ్యతను పెంచింది

అందమైన, పర్యావరణ హితమైన నగరంగా పేరొందిన నాపెర్​ వెల్లి నగరం తనను గౌరవించినందుకు మండలి బుద్ద ప్రసాద్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

ఇదీ చదవండి:

బీఆర్​ మీనాకు.. మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details